మొదటినుంచీ పాఠశాల విద్యకు జగన్నాథపురం పెట్టింది పేరు. 1991 లో సామా స్కూల్ ఆవిర్భావంతో ఆ పేరు మరింత బలపడింది. సామా ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో నూటడబ్బై మంది విద్యార్థులతో ప్రైమరీ స్కూల్‌గా మొదలై తరువాత హైస్కూల్ అయ్యింది. సామా ఈశ్వరరావుగారి తండ్రిగారు శ్రీ సామా సూర్యనారాయణ మూర్తిగారి ఆశయాలకు అనుగుణంగా సామా స్కూల్ నిర్వహించబడుతుంది. ఈ ఇరవై మూడు సంవత్సరాలలో ఎన్నో విజయ సోపానాలను అధిరోహిస్తూ 1700 మంది విద్యార్థులతో సామా నేడు ఒక ప్రముఖ పాఠశాలగా తల ఎత్తుకొని నిలబడి ఉంది.
సామా ఈశ్వరరావు గారు |
ఏడవ తరగతి కామన్ పరీక్షల్లో, పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొదటినుంచీ వందశాతం ఉత్తీర్ణత సాధిస్తుంది. 2004 లో టెంత్క్లాస్ పరీక్షలకి హాజరైన విద్యార్థులందరూ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. అలాగే 2003 నుంచి వరుసగా నాలుగు సార్లు సామా స్కూల్ ఉత్తమ స్కూల్ అవార్డును అందుకొంది. 2013 ఎస్.ఎస్.సీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్ధినులకి 10/10 హయ్యేస్ట్ గ్రేడ్లు వచ్చాయి. 80 మందికి తొమ్మిది నుంచి పది పాయింట్ల మధ్యలో వచ్చాయి. దీనికి కారణం సామా ఈశ్వరరావు గారి సమర్థవంతమైన నిర్వాహణ, ఉపాధ్యాయుల పరిశ్రమ.
స్కూల్ భవనం |
హాస్టల్ |
మంచి విద్యార్హతలున్న, సమర్థవంతులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులని నియమిస్తారు. పాఠ్యప్రణాళిక చక్కగా ఉంటుంది. రెగ్యులర్ సబ్జెక్ట్లతో పాటూ ఇంగ్లీషులో కమ్యూనికేషన్ స్కిల్స్, అబాకస్ మేథమెటిక్స్, డిజిటల్ లెర్నింగ్ కోసం ఎడ్యుకాంప్ క్లాస్ రూములు, వివిధ పోటీ పరీక్షలకోసం ప్రత్యేక తరగతులు, ఎం.బి.బి.యస్ యాస్పిరెంట్స్ కోసం ఇంటిగ్రేటెడ్ జనరల్ సైన్స్ మరియు బయలాజికల్ సైన్స్, ఐ.ఐ.టీ యాస్పిరెంట్స్ కోసం ప్రత్యేకమైన బ్యాచ్, ఆరు నుంచి పదవతరగతుల వరకూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ ప్రత్యేక తరగతులు.. లాంటి ఎన్నో విశేషాలు సామాకు ఉన్నాయి.
మెరిట్ స్టూడెంట్స్ కోసం ఫీజు రాయితీలు ఉన్నాయి, చదువులో వెనుక బడిన విద్యార్థుల కోసం సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకూ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
విశాలమైన ప్రదేశంలో పెద్ద స్కూల్ భవనం ఉంది. దూరప్రాంత విద్యార్థులు ఉండి చదువుకోవడానికి చక్కని హాస్టల్ ఉంది.
పట్టణస్థాయి, జిల్లాస్థాయి పోటీలలో, టాలెంట్ టెస్టుల్లో, నేషనల్ సైన్స్ ఓలింపియాడ్, రామానుజన్ మ్యాథ్స్ ఓలింపియాడ్ లాంటి ఎన్నో కాంపిటీషన్లలో సామా విద్యార్థులు బహుమతులను గెలుచుకొని సామా కీర్తిపతాకను ఎగురవేస్తున్నారు.
సామా విజయాల వెల్లువ |
కొత్తగా మారిన సిలబస్ ప్రకారం విద్యార్థి అవగాహనని కూలంకుషంగా టెస్ట్ చెయ్యడం జరుగుతుంది. బట్టీ విధానం సరిపోదు. పాఠ్యపుస్తకాలు చదివి సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. దానికి అనుగుణంగా పాఠ్యప్రణాళికను రూపొందించడం జరిగింది.
కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి.
Sama School
LKG to X English Medium
Jagannaickpur
Kakinada - 2
Ph: 0884 2378913, 9848164007