Tuesday, 22 April 2014

వింగ్స్ ఇంగ్లీష్ క్లబ్

"క్లాసులో మీరు మాట్లాడిస్తుంటే బాగానే మాట్లాడగలుగుతున్నాం కానీ, బయట ఎవరితోనూ ఇంగ్లీషులో మాట్లాడ లేక పోతున్నాం," అని చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొనే స్టుడెంట్స్ కంప్లైన్ చేస్తూ ఉంటారు. 

సాధారణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేటప్పుడు ఒక విషయాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన వొకాబ్యులరీని క్రోడీకరించి డిబేటుని కానీ, సంభాషణని కానీ అభ్యాసం చేయించడం జరుగుతుంది.ఈ విధమైన అభ్యాసానికి కావలసిన ముడిసరుకుని (విషయసమాచారం- దీనినే సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు, ఉపయోగించవలసిన పదాలు- దీనినే వొకాబ్యులరీ అంటారు) శిక్షకుడే అందించడం జరుగుతుంది. విద్యార్థి  చెయ్యవలసింది వీటిని వాఖ్యాలుగా నిర్మించడమే.

ముప్పై రోజులనుంచి, యాభై రోజులలో క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తూ ఆంగ్ల వ్యాకరణం మీద ఎవరైనా మంచి పట్టు సంపాదించవచ్చు. అప్పుడు ఎంత కష్టమైన విషయాన్నైనా అలవోకగా ఇంగ్లీషులో వ్యక్తీకరించవచ్చు.  క్లాసులో వ్యాకరణం నేర్చుకొంటున్నారు కనుక, టీచర్ ఇచ్చే విషయం మీద అతని సమక్షంలో స్టుడెంట్స్  చక్కగా మాట్లాడ గలుగుతున్నారు. కానీ బయటి సమాజంలో రోజువారీ సంభాషణ చేయవలసి వచ్చినప్పుడు మాట్లాడే విషయం మీద అవగాహన ఉండడం లేదు  అందుకే ఫెయిల్ అవుతున్నారు. 

As fluent as a mountain stream అని ఒక ఉపమానం ఉంది. పర్వతాలలో ప్రవహించే ప్రవాహంలాగ మాట్లాడడం అని అర్ధం. మీరు అంత అనర్గళంగా మాట్లాడగలగాలంటే మూడు విషయాలమీద పట్టు సాధించాలి. 

1.గ్రామర్
2.వొకాబ్యులరీ
3.మాట్లాడే సబ్జెక్ట్ 

మన వింగ్స్ ఇంగ్లీష్ క్లబ్  లో క్రమంగా మొదటి రెండు విషయాలమీదా పాఠాలను అందించడం జరుగుతుంది. వాటిని చదివి ఉపయోగించడంవల్ల ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడగలరు. దీనికితోడు మాట్లాడిస్తూ భయాన్ని తొలగించడం జరుగుతుంది. క్రమంతప్పక చేసే అభ్యాసం వల్ల ఫ్లూయన్సీ పెరుగుతుంది. ఏ సందర్భంలోనయినా సునాయాసంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు.  ఇక మూడవదైన `మాట్లాడే సబ్జెక్ట్` . `దీనిని అభివృద్ది చేసుకోవాలంటే ఏమిచెయ్యలి?` అనే దాని గురించి ఈ పోస్టులో కొన్ని సూచనలు ఇవ్వడం  జరిగింది.  
1. ధరల పెరుగుదల (Inflation), అవినీతి (Corruption), లింగవివక్ష (Gender bias), వాతావరణ కాలుష్యం (Environmental Pollution), ఉగ్రవాదం (Terrorism), నల్లధనం (Black Money), పట్టణీకరణం (Urbanization), జాతి సమైఖ్యత (National Integration), నిరుద్యోగ సమస్య (Unemployment Problem), కంప్యూటర్లు (Computers), మూఢనమ్మకాలు (Superstitions), నిరక్షరాస్యత (Illiteracy), విద్యావ్యవస్థ (Educational System), ప్రేమవివాహాలు (Love Marriages), కులవ్యవస్థ (Caste System), ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత (Importance of English) మొదలైన విషయాలు గురించి మన అభిప్రాయాలను సాధారణ సంభాషణలలో నిరంతరం ఉపయోగిస్తూ ఉండాలి.వీటిలో పరిజ్ఞానం సంపాధించడానికి మంచి పబ్లిషర్లు ముద్రించిన ఏవయినా ఎడ్వాన్స్డ్ జనరల్ ఎస్సే పుస్తకాలని చదవాలి. ప్రారంభంలో భాష పూర్తిగా అర్ధం కాకపోయినా, ఇంగ్లీష్ నేర్చుకొంటూ ఉండగా సమాంతరంగా ఈ పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల టెర్మినాలజీ (ఒక సబ్జెక్టుకి సంబంధించిన పదాల సమూహం) పైన పట్టు సంపాదించవచ్చు. ఇదే కాకుండా, ఇంగ్లీష్ భాషలో వాఖ్య నిర్మాణం కౌశలం మీకు తెలియకుండానే పట్టుబడుతుంది. 

2. నిరంతరం మారే విషయాలు - వీటినే కరెంట్ ఎఫైర్స్ అంటారు. వివిధ సందర్భాలలో వీటిమీద స్పందించవలసి ఉంటుంది.  దేశ విదేశాలలో జరిగే సంగతులు, రాజకీయాలు (Politics), దేశ ఆర్ధిక వ్యవస్థ (Economy), సినిమాలు (Films), వినోదం (Entertainment), క్రీడలు (Sports), నేరాలు (Crime), ప్రకృతి వైపరీత్యాలు (Natural disasters), వ్యక్తుల నియామకాలు (Appointments), షేర్ మార్కెట్ (Share Market) మొదలైనవాటి గురించి ప్రతిరోజూ డెక్కన్ క్రానికల్, ది హిందూ లాంటి పత్రికలు చదవాలి,  న్యూస్ పేపర్లలో ఎడిటోరియల్స్, ప్రత్యేక కాలంస్ ఫాలో అవ్వడం వల్ల విశ్లేషణ అలవాటు అవుతుంది.  టీ.వీ లో ఇంగ్లీష్ న్యూస్ చూడాలి. నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ, బీ.బీ.సీ. హెచ్.బీ.ఓ.మూవీస్ చానళ్ళు చూస్తూ, ఉచ్చారణ మీద దృష్టి పెట్టాలి.

3. ప్రారంభంలో ఒక ఇంగ్లీష్-తెలుగు డిక్ష్నరీ, కొంచం తరువాత ఇంగ్లిష్-ఇంగ్లిష్ డిక్ష్నరీలను ఉపయోగించి మీరు చదువుతున్నప్పుడూ, వింటున్నప్పుడూ తారసపడిన కొత్త పదాల అర్ధాలను తెలుసుకొని, గుర్తుపెట్టుకోవాలి.

మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకొన్న మొదటి రోజునుంచే ఈ పనులన్ని ప్రారంభించాలి. అతి తక్కువ కాలం లోనే అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడగలరు. విష్ యూ ఆల్ ద బెస్ట్!

Wings English Club
Opp: Sama School
Jagannaickpur, Kakinada.
Contact : 92904 65064