Friday 25 April 2014

దుర్గాప్రసాద్ స్కూల్

1994లో నూటఇరవై మంది విద్యార్థులతో జగన్నాధపురంలో దుర్గాప్రసాద్ స్కూల్ ప్రారంభించారు. మొదటి సంవత్సరం కేవలం 8,9,10 తరగతులు ఉండేవి. క్రమంగా విద్యార్థుల సంఖ్య, తరగతులు పెరిగాయి. ప్రస్తుతం ఎల్కేజీ నుంచి పదవతరగతి వరకూ 1500 మందికంటే ఎక్కువ విద్యార్థులతో కాకినాడలోనే ప్రముఖ పాఠశాలల్లో ఒకటిగా దుర్గాప్రసాద్  స్కూల్ కొనసాగుతుంది.
పోటీ పెరుగుతున్న ప్రస్థుత పరిస్థితుల్లో ప్రతీసంవత్సరం స్ట్రెంగ్త్ పెరుగుతూ వెళ్ళడం అనేది పాఠశాల యాజమాన్యం యొక్క కృషికి, నిబద్దతకీ నిదర్శనం. ఆ కృషిపేరు శ్రీ దుర్గాప్రసాద్ గారు. ఆయనే స్వయంగా మేథ్స్, సైన్స్ ఉపాధ్యాయుడై వుండడం ఈ స్కూలుకి ఉన్న గొప్ప ప్లస్‌పాయింట్. గతసంవత్సరం NDTV మరియూ PEARSON కంపెనీ వాళ్ళ ఆద్వర్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మాజీ క్రికెట్ కేప్టెన్ అనీల్ కుంబ్లే, కేంద్ర సహాయ మంత్రి శశీథరూర్, హిందీ నటి షబానా ఆజ్మీ చేతులమీదుగా  శ్రీ దుర్గాప్రసాద్ గారికి బహూకరించారు. ఇది దుర్గాప్రసాద్‌గారి నిబద్దతకి నిదర్శనం.

అనుభవజ్ఞులైన, క్వాలిఫైడ్ టీచర్స్, ఇంటరాక్టివ్ టీచింగ్ మెథడాలజీ, ప్రతీ విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ద, ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్‌లో విద్యార్థులని వెన్నుతట్టిప్రోత్సహించడం  మొదలైన ప్రత్యేకతలవల్ల, ముఖ్యంగా విద్యార్థులపై సొంతబిడ్డల్లా నిరంతరం వ్యక్తిగత శ్రద్ద వహించడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. పదవతరగతి పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడు 10/10 ని ఇద్దరు విద్యార్థినులు స్వంతంచేసుకొన్నారు. ప్రారంభం నుంచీకూడా ప్రతీసంవత్సరం ఈ తరహా ప్రతిభను దుర్గాప్రసాద్ స్టూడెంట్స్ ప్రదర్శిస్తూనే ఉన్నారు.  అందువల్లే తల్లితండ్రుల మొదటిచాయిస్ దుర్గాప్రసాద్ స్కూల్.
మెరిట్ స్టుడెంట్‌తో..
హాస్టల్ సదుపాయం ఉంది. రాష్టంలోనే అతి చక్కని హాస్టల్స్‌లో ఇది ఒకటి. బస్ సదుపాయం కూడా ఉంది. అందుబాటు ఫీజులు.
Durga Prasad School
LKG to X - English Medium
Near Munsib Junction,
Jagannaickpur,
Kakinada -2
PH: 0884-2345894, 6563333